శుభోదయం 13

By | November 20, 2022
telugu stories sahithi శుభోదయం 13 రాధాదేవి అతనివంక తిరస్కారంగా చూసింది. "మాధవ్! నీవు నిజంగా తండ్రివయితే, ఆమె మేలు కోరేవాడివయితే.... ఈ వచ్చిన అవకాశాన్ని ఆనందంగా ఉపయోగించుకుని నాకు కృతజ్ఞత చూపేవాడివి. నేను చేస్తున్నది త్యాగమనుకున్నావు కనక నన్నభినందించు. నేను చేసేది ఏమయినా శ్యామ్ ని మాత్రం నీవు సంస్కారవంతుడిగా అంగీకరించక తప్పదు. ఎవరికి పుట్టినా, ఎలా పుట్టినా శ్యాం సంస్కారాలున్నవాడు కాబట్టే ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి తనకు చాతనయినంతగా న్యాయం చేకూర్చాలనే తపనతో ఆమెని చేపట్టి మానవత్వం నిరూపించడానికి వప్పుకున్నాడు. నీలా గొప్ప తండ్రికి పుట్టలేదు. గొప్ప కులస్థుడికి పుట్టలేదు. కాని నీ కన్నా గొప్పగుణం వుంది అని గర్వంగా చెప్పగలను. మాధవ్, నీవేమనుకున్నాసరే మేం చేసేది త్యాగం అనుకోలేదు. ఎవరో ఏదో చేసిన నేరానికి రేఖ బలి అవడం నాకిష్టం లేక, ఓ ఆడపిల్ల జీవితం చక్కపరచాలని ఈ నిర్ణయానికి వచ్చాం. ఆమోదించేది, మానేది మీ యిష్టం. రేఖా.... నీవూ ఆలోచించుకో. పరిస్థితి విడమరచి చెప్పాను. నీవు కోల్పోయిన మనశ్శాంతి దొరకాలంటే... నీ జీవితానికో భద్రత వుందని నీవు నమ్మాలి. నీవూ అందరి స్త్రీలలాగే భర్తతో సుఖంగా వుండగలవని, తల్లివవగలవని నమ్మకం కల్గించడానికి శ్యాం నీకు చేయూత యివ్వడానికి సిద్దంగా వున్నాడు. ఆ చేయి అందుకునేది మానేది నీ యిష్టం. ఎవరి యిష్టాయిష్టాలకి నీ జీవితాన్ని బలిపెట్టకు. నీవు మరీ చిన్నపిల్లవి కావు. మైనారిటీ తీరినదానివి..." "రాధా... నా కూతురికి యివన్నీ నేర్పిపెట్టి నానుంచి దూరం చేయాలని చూస్తున్నావు. దానికిప్పుడు పెళ్ళి తొందరలేదు. నీ సహాయానికి థాంక్స్. పెళ్ళి అవసరం అనుకున్నప్పుడు.... నా కూతురికింకెవరూ మొగుడు దొరకనప్పుడు వస్తాంలే...." హేళనగా అన్నాడు. రాధాదేవి సహనం ఆఖరిమెట్టుకు వచ్చింది. "అప్పుడు నా కొడుకు నీకందే స్థితిలో వుండడు మాధవ్. శ్యామ్ కి తెలుసు మీరిలా మాట్లాడి అవమాన పరుస్తారని. అందుకే వెళ్ళవద్దన్నాడు. రేఖకోసం వచ్చాను. వస్తాను రేఖా.... నీకీ ఆంటీతో ఏ అవసరంవున్నా నిరభ్యంతరంగా రా అమ్మా." "ఆగండి ఆంటీ.... నేను శ్యాం ని చేసుకుంటాను. నా కిష్టమే. నన్ను చేసుకోవడానికి ముందుకొచ్చిన శ్యాం ఔదార్యం నాకర్ధం అయింది. శ్యాంలాంటి భర్త, తల్లిలాంటి మీ నీడ దొరకడం అదృష్టం అనుకుంటాను" రేఖ స్థిరంగా అంది. "రేఖా...." మాధవ్ ఏదో అనబోయాడు. "డాడీ! నన్ను నా యిష్టానికి వదిలేయండి. నేను చిన్నపిల్లని కాను. ఆలోచించే శక్తి వుంది. డాడీ..... ఈ పరిసరాలలో నేనింక వుండలేను. ఆంటీ..... శ్యాంలాంటి ప్రేమమూర్తులుండేచోట వుండాలని వుంది. నన్ను క్షమించండి

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.