శుభోదయం 14
telugu stories sahithi శుభోదయం 14 "రాజారాం.... నీకు నచ్చితే వేరే అడగాలా? పిల్లవాడి మేనమామవి. నీదే పెద్దరికం. నీవెలా చెపితే అలా చేస్తాను" రాధాదేవి రాజారాంని చూస్తూ తృప్తిగా అంది.
26
నెల తరువాత ఆరోజు శ్యాం, రేఖల వివాహం జరిగింది. ఉదయం రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేశారు. సాయంత్రం రిసెప్షన్. ఊర్లో చాలామంది మిత్రులు వచ్చారు. ఇదేదో ఆదర్శవివాహం అని చూడడానికి కొందరు కుతూహలంగా వచ్చారు.
"నిజంగా మీది చాలా పెద్దమనసండి. నిజంగా మీరు సహృదయులు. తప్పకుండా అభినందించాలి" అని కొందరు ఆమెని పొగుడుతుంటే...
"ఎందుకండీ మధ్య నా కభినంధన! చక్కటి భార్యని తెచ్చుకున్నందుకు మా అబ్బాయిని అభినందించండి...." అంటూ రేఖ భుజంచుట్టూ చెయ్యివేసి వారి మాటల అర్ధాన్ని మళ్ళించింది. ఇంకా ఎవరో ఏదో అంటూంటే రాధాదేవి వారిని పక్కకి పిలిచి "ప్లీజ్! నేనేదో పెద్ద ఆదర్శంగా ఈ వివాహం చేయించానని, మా అబ్బాయేదో త్యాగం చేశాడన్న భావం ఆ అమ్మాయికి రావడం నాకిష్టంలేదు. దయచేసి మామూలు వధూవరులను అభినందించినట్లు అభినందించండి" వారు నొచ్చుకోకుండా సౌమ్యంగా అంది.
మాధవరావు ఆఖరికి రేఖ పెళ్ళికి మనస్ఫూర్తిగా అంగీకరించక తప్పలేదు. రేఖ ఏమయినాసరే చేసుకుంటానంది. శారదకూడా ఎంతో నచ్చచెప్పింది. కోపం తగ్గాక పదిరోజులు రాత్రింబవళ్ళు ఆలోచించాక తన అహం చంపుకుని శ్యాం ని అంగీకరించడం మినహా గత్యంతరం లేదని తెలుసుకున్నాడు. రేఖకి అబార్షనయింది. ఆమె పూరతిగా కోలుకున్నాక నెలా యిరవై రోజుల తరువాత పెళ్ళి నిర్ణయించారు. ఈ పెళ్ళిలో మనస్ఫూర్తిగా మాధవరావు పాల్గొనేటట్టు చెయ్యడానికి రాధాదేవి అనేకసార్లు కలసి మాట్లాడి వప్పించింది. రేఖ ఆమెపట్ల విజ్ఞత చూపుతూ పదేపదే ఆ మాట అంటూంటే రాధాదేవి ఆమెని మందలించింది. "రేఖా, శ్యాం పట్ల నీకుండాల్సింది ప్రేమగాని, కృతజ్ఞత కాదు. నాపట్ల వుండాల్సింది గౌరవం, అభిమానంగాని కృతజ్ఞతకాదు. నీవు మరోసారి అలా మాట్లాడి నిన్ను కించపరుచుకోకు" అని