శుభోదయం 4

By | August 15, 2022
telugu stories kathalu sahithi శుభోదయం 4 వెళ్ళు నాయనా, కనీసం మీ అమ్మగారి తృప్తి కోసమన్నా వెళ్ళు....ఆవిడ ప్రాణం ఎంత కొట్టుకుంటుందో" ఆర్ద్రంగా అంది పార్వతమ్మ. తల్లి జ్ఞాపకంతో మాధవ్ మనసు కలతపడింది. రాధ దోషిలా తలదించుకుంది. అన్నపూర్ణమ్మ గంటనించి కాలుగాలిన పిల్లిలా తెరుగుతుంది. ఆవిడ మనసు ఏ పనిమీద నిలవడం లేదు. ఈరోజు కొడుకు పెళ్ళి అన్నమాట పదేపదే గుర్తుకు వస్తుంది. ఆ మాట తలుచుకున్నప్పుడల్లా ఆమె మనసులో ముల్లు గుచ్చినట్లవుతుంది. ఇంటికి పెద్ద కొడుకు! ఆ కొడుకు పెళ్ళి తమందరూ వుండి దిక్కు మొక్కు లేనివాడిలా చేసుకుంటూన్నాడు. అన్న ఆలోచన ఆమె గుండెని రంపపు కోత పెడ్తుంది. ఎంత తమని కాదని చేసుకుంటూన్నాడని కోపం తెచ్చుకుంటున్నా ఆ తల్లి ప్రాణం ఎందుకో నిలవడం లేదు.....యిదెం ఖర్మ వచ్చింది, ఎంత ప్రారబ్ధం! కొడుకుని కోడలిని నట్టింట గృహప్రవేశం చేయించి ముద్దు ముచ్చట తీర్చుకునే అదృష్టం తనకి లేదు. అవతల కొడుకు పెళ్ళి, అవుతుంటే ఎవరిదో అన్నట్టు యిక్కడ పడి వుండాల్సిన గతి పట్టిచ్చిన కొడుకుని ఒక పక్క క్షమించలేకపోతుంది ఆవిడ. మరొకపక్క మమతని దూరం చేసుకోలేక అల్లాడుతుంది. వీధి వరండాలో పేపరు చదువుతున్న అవధాని గారి పరిస్థితి అలాగే వుంది. మగవాడు కనక అన్నపూర్ణమ్మలా బయట పడకుండా మనసులో మధన పడ్తున్నాడు. 'నాకు కొడుకే లేడనుకుంటాను' అని మాటైతే అనగలిగాడు గాని ఆ బంధం అంత సుళువుగా ఎలా తెంచుకోగలదు! ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు కొడుకు మీద! ఆఖరికి యిలా తనమాట కాదని కులం, వంశం, గౌరవం చెల్లెళ్ళ, తమ్ముళ్ళ భవిష్యత్తు లెక్క చెయ్యకుండా కులం గోత్రం తెలియని దానిని పెళ్ళాడి తన దారి తను చూసుకోవడం అయన క్షమించలేకపోతున్నాడు. ఒక్కక్షణం వాడు లేడు నాకు ఇంక అని నిబ్బరంగా అనుకుంటూ పేపరు చదవడానికి ప్రయత్నిస్తాడు. మరుక్షణంలో పేపరు పక్కన పెట్టి ఆలోచనలో పడ్తాడు. ఇద్దరికీ ఇద్దరూ బాధ పడ్తున్నారు. ఇంట్లో పిల్లలు ఏదో తప్పు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.