శుభోదయం 8

By | September 22, 2022
telugu stories kathalu sahithi శుభోదయం 8 శారద అమాయకురాలే కావచ్చు. శారదలో మాలిన్యం లేకపోవచ్చు... కాని... మాధవ్ పురుషుడన్న విషయం రాధ మరిచిపోయింది. అందులో సంసార సుఖానికి దూరమైవున్న మగవాడు అన్న విషయం రాధ విస్మరించింది. ఈ తొమ్మిది నెలల్లో శారద, మాధవ్ యిద్దరూ కాకూడనంత దగ్గిరయ్యారు. కాదు, శారదకి తగ్గిర అయ్యాడు మాధవ్. మంచి మాటలతో, తీపి మాటలతో శారదకు చేరువయ్యాడు. మాధవ్ కి మొదట్లో శారదంటే చికాకు, ఆ వెకిలిమాటలంటే విసుగు, సాధ్యమైనంతవరకు ఎవాయిడ్ చేసేవాడు. కాని, రెండేళ్ళలో ఆమె అమాయకత్వం, అభిమానం చూసి పాపం పిచ్చిది అనుకునేవాడు. రాధ దూరమైనకొద్ది శారద చేరువయింది. మొదట్లో ఏదో యింట్లో తిరిగే అమ్మాయి అన్నట్టు కాఫీ, టిఫిను తెచ్చి యిచ్చినప్పుడు తినడం తప్ప పెద్దగా పట్టించుకోలేదు. కాని, అతను మగవాడు... నిండు యవ్వనంలో వున్నవాడు. భార్యకి దూరమై కోరికలతో సతమతమవుతున్న సమయంలో శారద చూపే అభిమానం, చనువు అతనికెంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. రాధతో సంసార సుఖానికి దూరమయి ఐదారు నెలలయిందేమో... ఆ వేడిలో శారద కూడా అందంగా కనపడడం మొదలుపెట్టింది. ఆమె అమాయకత్వం అతనికి ప్రోత్సాహాన్నిచ్చింది. "నీవు ఎంత బాగా కాఫీ చేస్తావు శారదా...", "అబ్బ ఈ ఉప్మా రాధ అసలు బాగా చేసేది కాదు నీవెంత బాగా చేశావు...", "నీ చేతిలో అమృతం వుంది శారదా, నిజంగా మీ అక్కయ్యకిలా వంట్లో బాగులేనప్పుడు నీవున్నావు కనక నాకిబ్బంది తెలియడంలేదు, నిజంగా శారదా నీవెంత మంచిదానివి, నీ అంత అమాయకురాలిని చూడలేదు సుమా. స్వంత అక్క, బావలకి చేసినట్టు చేస్తున్నావు మాకు. నేనంటే నీకింత అభిమానం ఎందుకు..." ఇలాంటి పొగడ్తలతో కొన్నాళ్ళు ఆ అమాయకురాలని ఉబ్బేసాడు. ఆ పొగడ్తలతో సిగ్గుపడి ఆనందపడి అతనిపట్ల అభిమానం మరింత పెంచుకుంది శారద. ఆ తరువాత ఓ రోజు కాఫీ పట్టుకొస్తే కప్పందుకుంటూ చెయ్యిపట్టుకు కొంటెగా కళ్ళలోకి చూశాడు. పాతికేళ్ళు వచ్చినా పురుషస్పర్శ ఎరుగని శారద పులకించి సిగ్గుపడి మెలికలు తిరిగింది. ఆ అదను కనిపెట్టి చెయ్యిపట్టి దగ్గిరకు లాక్కుని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. శారద మైమరచిపోయింది. అయినా అతను చేసినని తప్పని ఆ అమాయకురాలికి అర్థం అయి అతని కౌగిలి విడిపించుకుంది సిగ్గుపడ్తూ... "శారదా... నీవంటే నాకెంతో యిష్టం... చూడు ఇది మీ అక్కయ్యకు చెప్పకు సుమా!" అన్నాడు రహస్యంగా. "ఛీ... పో... చెప్తానేమిటి" అంది శారద సిగ్గుపడ్తూ. అలా అవకాశం దొరికినప్పుడల్లా శారదని దగ్గిరకు లాక్కుని,

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.