శుభోదయం 9

By | October 22, 2022
telugu stories kathalu sahithi శుభోదయం 9 అతడు ఒక్కక్షణం దోషిలా తలదించుకుని నిలబడ్డాడు. తరువాత శారదముందు భార్య అలా అవమానించడంతో మగ అహం తలెత్తింది. ధైర్యం కూడదీసుకుని "శారదా నీవు వెళ్ళు..." అంటూ తలుపుతీసి ఆమెని పంపించాడు. వెనుదిరిగి వచ్చిన మాధవ్ ని చూసి రాధ గుండె ఆవేశంగా ఎగిరిపడింది. "నా కళ్ళు కప్పి నా యింట్లోనే ఇంత నాటకం ఆడుతున్నారన్నమాట- అభం శుభం తెలియని ఆ శారదే దొరికిందా మీకు, ఆ అమ్మాయిని యిలా చెయ్యడానికి మీకు మనసెలా వప్పింది... హు! ఎవరో బలవంతంగా నామీద అత్యాచారం చేస్తే నేను అపవిత్రం అయ్యానని నన్ను తాకలేదే మీరు... యిప్పుడు మీరు తెలిసీ కావాలని దొంగచాటుగా చేసిన యీ పనిని ఏమంటారు! మీరేంచేసినా మీరు పురుషులు కనక అపవిత్రులవరా? చెప్పండి! నా తప్పు లేకపోయినా నన్ను శిక్షించారు దూరంచేసి. యిప్పుడు తెల్సి మీరు చేసిన ఈ పనికి నేను మిమ్మల్నేం చెయ్యాలి చెప్పండి..." ఆమె అన్నాళ్ళ కసి, ఉక్రోషం అతడిని కడిగేసి జవాబు చెప్పమన్నట్టు చూసింది. జవాబుకి తడుముకున్నాడు మాధవ్. "ఏం, జవాబు చెప్పలేకపోతున్నారా పాపం... నా కళ్ళుకప్పి నా వెనక యింత నాటకం ఆడుతున్న మీకు ఏ తప్పు అంటదా... యిలా చేశారేం అని అడిగే హక్కు నాకు లేదంటారా?... ఏదో యింకా పాపం సంసార సుఖానికి దూరమయి బాధపడ్తున్నారని జాలిపడ్డాను యిన్నాళ్ళు. మీరింత తెలివిగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ఊహించలేకపోయాను. ఆ అమాయకురాలు శారదని ఎందుకు పాడు చేశారు, యిప్పుడు పిన్నిగారికి నేనేం చెప్పను? ఇంక శారద గతి ఏమవుతుంది... జవాబు చెప్పండి..." క్రోధంగా అడిగింది. ఆమె నిలేసిన తీరు చూసేసరికి అతని మగ అహం మేల్కొంది. "నీకు నేను జవాబివ్వవలసిన అవసరంలేదు. నేనూ మనిషిని, మగాడిని. పట్టుమని ముప్ఫైఏళ్ళన్నా లేని ఈ వయసులో ముసలివాడిలా ఎలా వుండగలననుకున్నావు? కోరికలుండవనుకుంటున్నావా... నీకు చెప్పి చేయాలా అన్నీ... నా ఇష్టం, మగవాడిని ఏమన్నా చేస్తాను" బింకంగా అన్నాడు. "ఓహో... తమరు మగవారు కనక కోరికలుంటాయి. అవి తీర్చుకోవడానికి అడ్డదారి తొక్కినా ఫరవాలేదన్నమాట. నేను ఆడదాన్ని కనక నాకు కోరికలు వుండరాదు. వున్నా తీర్చుకోరాదు. తీర్చుకున్నా మొగుడు దయ చూపితే తీర్చుకోవాలి. అవునా, మీలాగే నేనూ మీరు దగ్గిరికి రావడంలేదని యింకోడి దగ్గిరకి వెళితే వూరుకునేవారా?" వ్యంగ్యంగా అంది. "ఏం మాట్లాడరేం... నేను చెయ్యని నేరానికే నన్ను శిక్షించారు. యింక

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.