శుభోదయం 7

By | September 16, 2022
telugu stories kathalu novels శుభోదయం 7 తల్లిలా ఓదార్చిన పార్వతమ్మని చూసి, పాతకాలపుదైనా ఆవిడ సంస్కారానికి మనసులోనే జోహార్లు అర్పించింది. పార్వతమ్మ అన్నట్టు, అనుకున్నట్టు ఆవిడ చూపిన సంస్కారం మాత్రం కూడా ఆధునికుడు అనుకున్న మాధవ్ చూపలేకపోయాడని రాధ బాధ. ఎంతైనా మాధవ్ తన భర్త. తమ మధ్య పొరపొచ్చాలు బయట లోకానికి తెలిస్తే తన బతుకు అందరిలో మరింత లోకువ అవుతుందని ఎవరన్నా వచ్చినప్పుడు నువ్వు మొహంమీద పులుముకుని మాట్లాడేది. ఆ సంఘటన తమమీద ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పాలని తాపత్రయపడేది. పైవాళ్ళ దగ్గిర దాచకల్గినా యింట్లో మాదిరి తిరిగే పార్వతమ్మ దగ్గిర ఎలా దాచకలదు? అందులో శారద అనుక్షణం తనచుట్టూ తిరుగుతూ, తను మాట్లాడడంలేదని, మాధవ్ తను మాట్లాడుకోవడంలేదని, ఎప్పుడూ విచారంగా పడుకుంటుందని తల్లికి చెప్పేది. పార్వతమ్మకీ వాళ్ళిద్దరి వరస అనుమానం వచ్చినా అడగలేక వూరుకుంది. ఆఖరికింక ఆగలేక, రాధ మ్లానమైన ముఖం చూడలేక "ఏమిటమ్మా రాధా... మాధవ్... యిలా మారిపోతాడని అనుకోలేదమ్మా... ఎంతో మంచివాడు, సహృదయుడు, ప్రేమించి పెళ్ళాడాడు... ఇంత మాత్రానికే నిన్నిలా..." "నా దురదృష్టం పిన్నిగారూ! దౌర్భాగ్యురాలిని అందలం ఎక్కించాలన్నా జరగదు. పుట్టుకతోనే దురదృష్టం నన్నంటే వుంది. ఏదో ఏనాడో చేసిన చిన్న పుణ్యంవల్ల రెండేళ్ళు కలలాగా మంచిరోజులు వచ్చాయి. వెళ్ళిపోయాయి. నా దురదృష్టం నన్ను వరించింది మళ్ళీ..." ఏడ్చింది రాధ. ఆవిడ కరిగిపోయింది. "ఛీ... ఛీ... ఈ మగజాతి యింతేనమ్మా... వాళ్ళకి కావల్సింది మన శరీరం తప్ప మనసు కాదు. వాళ్ళెన్ని తిరుగుళ్ళు తిరిగినా వాళ్ళని మనమేం అనకూడదు. అది తప్పేకాదు వాళ్ళకి... కాని మనం చెయ్యని నేరానికి కూడా శిక్ష అనుభవించాలి... వుండు మాధవ్ ని అడుగుతాను, ఇదేం అన్యాయం." "వద్దు పిన్నిగారూ... లాభంలేదు- ఆయన మనసు కావాలి కాని నాకు ఆయన దేహంకాదు. ఆయన మనసు యింక నామీద లేదు. ప్రేమ, అనురాగంలేని దాంపత్యం కోసం అలమటించడంలేదు. బలవంతాన యిద్దరం ఏం పొందగలం... కానీండి. ఆయనన్నట్టు కొన్నాళ్ళుపోతే జరిగింది మర్చిపోగలిగితే... మళ్ళీ... మళ్ళీ నా జీవితం చిగురించవచ్చు. యిది మా యిద్దరి మధ్యనే వుండాల్సిన విషయం...ఇంకోరు కలగచేసుకుంటే... బాగుండదు..." వారించింది రాధ. ఈ నెలా పదిరోజులలో రాధ మనసు దెబ్బతిని గట్టిపడింది. ఆమెలో

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.